![]() |
![]() |

యూట్యూబర్ గా, షార్ట్ ఫిలిం మేకర్ గా , నటుడిగా,సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష చెముడు నూతన గృహ ప్రవేశం చేశాడు. ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ చేస్తో ఫుల్ బిజీ ఐపోయాడు. రవితేజ ప్రొడ్యూసర్ గా రూపుదిద్దుకుంటున్న "సుందరం మాస్టర్" అనే మూవీలో హీరోగా చేస్తున్నాడు వైవా హర్ష. రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న హర్ష ఇప్పుడు సొంతింట్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ గృహప్రవేశానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ విచ్చేసి విష్ చేసాడు. హర్ష, సాయిధరమ్ తేజ్ మంచి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ , ఇండస్ట్రీ పెద్దలు, హర్ష అభిమానులు అందరూ కూడా అభినందనలు చెప్తున్నారు.
వైవా వీడియోస్ తో బాగా పాపులర్ ఐన హర్ష 2013లో మసాలా మూవీతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన వైవా హర్ష తర్వాత మైనే ప్యార్‌కియా, పవర్, గోవిందుడు అందరివాడేలే, సూర్య వర్సెస్ సూర్య, సైజ్ జీరో, దోచేయ్, శంకరా భరణం, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్ ఐ లవ్యూ, భానుమతి అండ్ రామకృష్ణ వంటి మూవీస్ లో నటించి మెప్పించాడు. కొంత కలం క్రితం వచ్చి సూపర్ హిట్ ఐన సుహాస్ నటించిన అవార్డు ఫిలిం "కలర్ ఫొటో"లో వైవా హర్ష నటన ఎవరూ మర్చిపోలేరు. ఈ మూవీ తర్వాత మరిన్ని సూపర్ హిట్ మూవీస్ కూడా చేసాడు . వివాహ భోజనంబు, మంచి రోజులొచ్చాయ్, కార్తికేయ 2, బింబిసార, బేబీ, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే ఇప్పటివరకు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన వైవా హర్ష ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. "సుందరం మాస్టర్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీతో సంతోష్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
![]() |
![]() |